Machilipatnam | ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

Machilipatnam | ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం జిల్లా (Machilipatnam District) కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ (DK Balaji) ఘనంగా నిర్వహించారు. మొదటగా రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీ చైర్మన్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం సిబ్బందితో జిల్లా కలెక్టర్ (Collector) రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రజలకు అద్భుతమైన రాజ్యాంగం అందించిన ప్రతి ఒక్కరూ దేశానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, ఇతర ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
