Machilipatnam | ముస్తాబు కిట్లు పంపిణీ..

Machilipatnam | ముస్తాబు కిట్లు పంపిణీ..

  • 140 మంది వసతి గృహ బాలికలకు అంద‌జేత‌

Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : వివాహ శుభ సందర్భంగా ఈ రోజు ప్రవాసాంధ్రులు చదలవాడ దివాకర్ పావని దంపతుల కుమార్తె సిమ్రాన్, చిరంజీవి నీల్ నూతన దాంపత్య జీవితానికి సేవామయ శుభారంభంగా, మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 140 మంది వసతి గృహ బాలికలకు ముస్తాబు కిట్లను పంపిణీ చేశారు. సుమారు రూ.30వేల‌ విలువైన ఆడపిల్లలకు అవసరమయ్యే ముస్తాబు కిట్లను ది ఎవిలిన్ హోమ్ ఫర్ గర్ల్స్, హ్యాపీ హోమ్ ఫర్ గర్ల్స్, హైనీ గర్ల్స్ హాస్టల్‌లలో ఆశ్రయం పొందుతున్న బాలికలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘసేవకులు సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, మైత్రి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు వరప్రసాద్, అధ్యక్షులు వేణు కుమార్, ఉపాధ్యక్షులు రిలాక్స్ ప్రసాద్, కార్యదర్శి రాధాకృష్ణ సభ్యులు అనిల్, రామకృష్ణ, సుధీంద్ర, మాణిక్యాలరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతం చేశారు.

Leave a Reply