Khazipet | ప్రేమించిన యువతినే…

Khazipet | ప్రేమించిన యువతినే…

Khazipet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కడప జిల్లా (Kadapa District) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని వేధించిన వ్యక్తి చివరకు ఆమెను హత్య చేయడం కలకలం రేపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఖాజీపేట (Khazipet) లో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తనను పెళ్లి చేసుకోలేదనే కోపంతో శ్రీనివాసులు అనే వ్యక్తి యువతిని గొంతుకోసి హత్య చేశాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రి (Kadapa RIMS Hospital) కి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహం, ఆందోళనలకు దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply