loss of Rs. 6 lakh | కన్నెపల్లిలో ఘోరం..
అంతుచిక్కని వ్యాధితో 50 గొర్రెల మృతి…
రూ.6 లక్షల ఆస్తి నష్టం..
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జి జేడీ ఈర్ల శంకర్…
గొర్రెల శాంపిల్స్ ఆదిలాబాద్ ల్యాబ్‌కు…
Rs. 6 lakh | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం నాయకంపేట గ్రామపంచాయతీ పరిధిలోని కురుమగూడెంలో అంతుచిక్కని వ్యాధితో 50 గొర్రెలు(50 sheep) అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన రైతాంగంలో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ సంఘటనలో సుమారు రూ.6 లక్షల నష్టం(loss of Rs. 6 lakh) జరిగినట్టు రైతు తెలిపారు. చనిపోయిన గొర్రెలు స్థానిక రైతు పెద్దాల్ల వీరమల్లువిగా గుర్తించారు. బుధవారం నాడు వీరమల్లు తన గొర్రెల మందను మామూలుగా అడవికి మేతకు తీసుకెళ్లగా, రాత్రి అక్కడే ఉంటాయి. అయితే ఈ రోజు తెల్లవారగానీ చూసేసరికి 50 గొర్రెలు నోటి నుంచి నురుగులు కక్కుతూ కుప్పకూలి మృతి చెంది ఉన్నాయని ఆయన కన్నీరుమున్నీరుగా చెప్పారు. గొర్రెల మృతి మా గ్రామంలో ఎప్పుడూ జరగలేదనీ, నా బతుకు దెరువు ఇదేనని ఒక్కసారిగా అన్నీ పోయాయి” అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు..
సమాచారం అందిన వెంటనే జిల్లా పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జి జాయింట్ డైరెక్టర్ ఈర్ల శంకర్(Eerla Shankar), మండల పశువైద్యాధికారి డాక్టర్ సీహెచ్. శ్వేత కురుమగూడెం చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. గొర్రెల కాలేబరాల నుండి శాంపిళ్లు సేకరించి ఆదిలాబాద్ పశుసంవర్ధక ల్యాబొరేటరీకి పంపినట్టు అధికారులు వెల్లడించారు. ఈ మృతి అంతుచిక్కని వ్యాధి వల్ల జరిగిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నాం. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు(samples sent to lab) పంపాం. రెండు రోజుల్లో వ్యాధి కారణం తెలియనుంది. స్థానిక పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అంశాన్ని నివేదిస్తామని తెలిపారు.

