లారీ, బైక్ ఢీ.. ఇద్దరు మృతి..

  • మృతుల గ్రామాల్లో విషాదం..
  • ఇద్దరూ జామకాయ వ్యాపారులే..

సత్తుపల్లి, ఆంధ్రప్రభ ; అతివేగంగా, జాగ్రత్తగా వెళుతున్న లారీ ఒకటి ఎదురుగా బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, నారాయణపురంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్లే… పెనుబల్లి మండలం, మండాలపాడుకు చెందిన పానెం సులేమాన్ (55), సత్తుపల్లి మండలం, రేజర్ల గ్రామానికి చెందిన సాలి నాగేశ్వరరావు (60) జామకాయలు అమ్ముతూ జీవనం గడుపుతున్నారు.

ఈ క్రమంలో గురువారం ఉదయం నారాయణపురం సమీపంలోని జామ తోటకు వెళ్లి కాయలు తీసుకొని తిరిగి సత్తుపల్లి వస్తుండగా నారాయణపురం మూల మలుపు వద్ద అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న ఏపీ 16, టీటీ 6677 నెంబర్ లారీ బలంగా ఢీకొన్నది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న108 సిబ్బంది హుటా హుటినా సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాళ్ల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, నగదు బంధువులకు స్వాధీనపరిచారు. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో వారి గ్రామాల్లో విషాదం నిండుకున్నది. కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా రోదిస్తున్నారు.

Leave a Reply