Lok Sabha | ఏ రంగానికి ఎంతంటే..?

Lok Sabha | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రవేశ పెట్టారు. ఆమె వరుసగా ప్రవేశపెట్టిన 9వ బడ్జెట్ కావడం గమనార్హం. నిర్మలా సీతారామన్ ఆదివారం రూ.53.47 లక్షల కోట్లతో యూనియన్ బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్​లో భాగంగా యువత ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఈ బడ్జెట్​ను తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల కోసం కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.

Lok Sabha | మొత్తం రూ.53.47 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

బడ్జెట్ స్వరూపమిదే..
బడ్జెట్‌ పరిమాణం – రూ.53.47 లక్షల కోట్లు
రెవెన్యూ లోటు – రూ.5,92,344 కోట్లు
ద్రవ్యలోటు – రూ.16,95,768 కోట్లు

Lok Sabha | రంగాలవారీగా కేటాయింపులు

రవాణా రంగం – రూ.5,98,520 కోట్లు
రక్షణ రంగం – రూ.5,94,585 కోట్లు
గ్రామీణాభివృద్ధి రంగం – రూ.2,73,108 కోట్లు
హోంశాఖ కార్యకలాపాలు – రూ.2,55,234 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలు – రూ.1,62,671 కోట్లు
విద్యారంగం – రూ.1,39,289 కోట్లు
ఇంధన రంగం – రూ.1,09,029 కోట్లు
వైద్య, ఆరోగ్యం – రూ.1,04,599 కోట్లు
పట్టణాభివృద్ధి – రూ.85,522 కోట్లు
ఐటీ, టెలికాం – రూ.74,560 కోట్లు
వాణిజ్యం, పరిశ్రమలు – రూ.70,296 కోట్లు
సాంఘిక సంక్షేమం – రూ.62,362 కోట్లు
శాస్త్ర సాంకేతిక రంగాలకు – రూ.55,756 కోట్లు
పన్ను నిర్వహణ – రూ.45,500 కోట్లు
ఆర్థిక నిర్వహణ – రూ.20,649 కోట్లు
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి – రూ.6,812 కోట్లు

Lok Sabha | బడ్జెట్లో రూపాయి రాక

అప్పులు – 24 శాతం
ఆదాయ పన్ను – 21 శాతం
కార్పొరేషన్‌ పన్ను – 18 శాతం
జీఎస్టీ, ఇతర పన్నులు – 15 శాతం
పన్నేతర ఆదాయం – 10 శాతం
ఎక్సైజ్‌ డ్యూటీ – 6 శాతం
కస్టమ్స్‌ ఆదాయం – 4 శాతం
రుణం లేని మూలధనం – 2 శాతం

Lok Sabha | రూపాయి పోక

రాష్ట్రాలకు పన్ను చెల్లింపులు – 22 శాతం
రుణాలకు వడ్డీ చెల్లింపులు – 20 శాతం
కేంద్ర ప్రభుత్వ పథకాలు – 17 శాతం
రక్షణ రంగం – 11 శాతం
కేంద్ర ప్రాయోజిత పథకాలు – 8 శాతం
ఆర్థిక సంఘం, ఇతర బదిలీలు – 7 శాతం
ఇతర ఖర్చులు – 7 శాతం
ప్రధాన సబ్సిడీలు – 6 శాతం
పౌర పింఛన్లు – 2 శాతం

Leave a Reply