Local elections | గెలిపించండి.. అభివృద్ధి చేస్తాం..
Local elections | టేకుమట్ల, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ బలపరిచినఅభ్యర్థులను సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల(Local elections)లో భాగంగా రాఘవపూర్, గరిమిలపల్లి, కలికోట బోర్ణపల్లి వెంకట్రావుపల్లి పంగిడిపల్లి ఆసిరెడ్డిపల్లి సోమన్ పల్లి సుబ్బక్కపల్లి ఎంపేడు కుందన పెళ్లి బండపల్లి గుమ్మడవెల్లి రామకృష్ణ పూర్(టి ) టేకుమట్లతదితర గ్రామాల అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కాలేదన్నారు. గ్రామాలలో అభివృద్ధి(development) కుంటుపడిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలలో శ్మశాన వాటికలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
ప్రతి గ్రామ పంచాయతీకి చెత్త తరలించడానికి ట్రాక్టర్లను సమకూర్చిందన్నారు. అంతర్గత రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుందని చెప్పారు. కాగా వెంకట్రావు పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి అనవేన సృజన రమేష్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

