ఎల్వోసీ పత్రాలు అందచేత…

భవానిపురం, ఆంధ్రప్రభ ; పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సీఎం సహాయనిధి కి సంబంధించిన రెండు లేఖలను లబ్ధిదారులకు అందచేశారు.. 56 వ డివిజన్ కు చెందిన తాడికొండ మహేష్ ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నాడు.. చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన ఎమ్మెల్యే ను సంప్రదించగా మెరుగైన వైద్యం కోసం రూ. 4,06,000 లు సాయం అందించాలని కోరుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లేఖ రాసారు.
అదేవిధంగా 40 వ డివిజన్ కు చెందిన నందికనుమ మహేంద్ర నరాలకు సంబంధించిన వ్యాధి తో బాధ పడుతూ ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించగా ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి మెరుగైన వైద్యం కోసం 4,00,000/- రూపాయల సాయం కోరుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి లేఖ రాసారు.. వీటికి సంబంధించిన ఎల్వోసీ పత్రాలను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితుల కుటుంబ సభ్యులకు అంద చేశారు.. కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు మైలవరపు దుర్గారావు, మువ్వల వెంకట సుబ్బయ్య , కూటమి నాయకులు , సుజనా మిత్రలు పాల్గొన్నారు…
