బాధితుడికి రూ.4.50 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత‌..

బాధితుడికి రూ.4.50 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత‌..

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని శివునిపల్లికి చెందిన గుర్రం వెంక టేష్ అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.4.50 లక్షల ఎల్‌ఓసీ చెక్కు ను ఆదివారం మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ శాసనస భ్యులు కడియం శ్రీహరి హన్మకొండ కనకదుర్గ కాలనీలోని తన నివాసం లో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్న పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అవసరమైన వారికి వైద్య సహాయం అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంద న్నారు.

ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడితే తమ దృష్టికి తీసుకురావాలని, తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞ తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఫాతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply