Loans | మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Loans | మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
Loans | చిట్యాల, ఆంధ్రప్రభ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలను మహిళా సంఘాలకు అందిస్తుందని నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం అన్నారు. ఈ రోజు చిట్యాల మున్సిపాలిటీకి సంబంధించిన మహిళ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులను మహిళలకు ఆయన అందజేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ చీరలను అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళా సంక్షేమం ప్రభుత్వం ఉద్దేశమని అందులో భాగంగా ప్రజాపాలనలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

