Loading | చట్టానికి తూట్లు పొడుస్తున్న రెవెన్యూ వ్యవస్థ..?

Loading | చట్టానికి తూట్లు పొడుస్తున్న రెవెన్యూ వ్యవస్థ..?

  • స్థానిక అవసరాల పేరుతో ఇచ్చిన ఇసుక అనుమతులు
  • ట్రాక్టర్లలో, JCBలతో లోడింగ్‌పై ఆరోపణలు

Loading | తంగళ్ళపల్లి, ఆంధ్రపభ : తంగళ్లపల్లి మండలంలో చట్ట నిబంధనలను పక్కనపెట్టి ఇసుక తరలింపు జరుగుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. స్థానిక అవసరాల కోసం మాత్రమే ఇచ్చిన ఇసుక అనుమతులను దుర్వినియోగం చేస్తూ, ట్రాక్టర్లలో కూలీల ద్వారా ఎత్తాల్సిన ఇసుకను JCBలతో లోడ్ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక అవసరాల కోసం ఇచ్చే ఇసుక అనుమతుల్లో యంత్రాల వినియోగం నిషేధం ఉన్నప్పటికీ, ఆ నియమాలను పూర్తిగా విస్మరిస్తూ JCBలతో ఇసుక లోడింగ్ జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నేరుగా చట్టానికి తూట్లు పొడిచినట్టేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండానే జరుగుతుందా? లేక తెలిసే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Loading

ఒకవైపు ‘స్థానిక అవసరాల కోసం మాత్రమే’ అనుమతులు ఇస్తూ, మరోవైపు యంత్రాలతో ఇసుక తరలింపు జరగడం వెనుక ఎవరి పాత్ర ఉందన్నది చర్చనీయాంశంగా మారింది. అక్రమంగా JCBలతో ఇసుక లోడింగ్ వల్ల వాగులు, పరిసర ప్రాంతాలు దెబ్బతింటున్నాయని, భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారితో పాటు, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టి, స్థానిక అవసరాల పేరుతో జరుగుతున్న అక్రమ ఇసుక తరలింపుకు తక్షణమే బ్రేక్ వేయాలని ప్రజలు కోరుతున్నారు

Leave a Reply