57 షాపులకు 916 అప్లికేషన్లు

57 షాపులకు 916 అప్లికేషన్లు

  • సాయంత్రం వరకు పెరిగే అవకాశం
  • అత్యధికంగా నడికుడా షాపుకు 57

ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ జిల్లాలో మద్యం షాప్ టెండర్ల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నాయి.జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ లో 57 మద్యం షాపులు ఉండగా ఇప్పటివరకు 916 దరఖాస్తు లు మాత్రమే వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ తెలిపారు. గత ఏడాది ఇప్పటివరకు 1400 దరఖాస్తులు వచ్చినట్లు ఈరోజు సాయంత్రం గడువు ముగిసే వరకు గత ఏడాది వచ్చిన టెండర్ల మార్కును దాటుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కొంతమంది వ్యాపారులు సిండికేట్ గా మారి టెండర్లను వేయడంలో ఏమైనా అడ్డుపడుతున్నారా, లేక రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ ఫీజు పెంపు ఏమైనా టెండర్ల మందకొడీగా పడటానికి కారణం అయి ఉంటుందని అంచనా .అత్యధికంగా పరకాల రెవెన్యూ డివిజన్లో ఉన్న నడికుడా వైన్ షాప్ కు 57 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply