Liquor shops | ఏడాదంతా ఎన్నికలూ-జాతరలే !

Liquor shops | ఏడాదంతా ఎన్నికలూ-జాతరలే !

Liquor shops | డిసెంబర్ ఒకటి నుండి కొత్త మద్యం


Liquor shops | నర్సంపేట, ఆంధ్రప్రభ : అమ్ముకున్నోడికి అమ్ముకున్నంత లక్కు… కొనుక్కుని తాగినోడికి తాగినంత కిక్కు… ఇదీ డిసెంబర్ ఒకటి నుండి తెలంగాణ మద్యం షాపుల దృశ్యం. వివరాల్లోకెళ్తే… తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఒకటి నుండి కొత్త మద్యం షాపులలో మద్యం అమ్ముకోవడానికి అనుమతులిచ్చింది. ఈ కొత్త మద్యం షాపులకు (liquor shops) ఏడాదంతా లక్కే లక్కు.

Liquor shops | మందు…విందులకే ప్రాధాన్యం

Liquor shops

ఎందుకంటే డిసెంబర్ లో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ మహాజాతర (Sammakka Saralamma Mahajathara) జరగనుంది. ఇక వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత మున్సిపాల్టీల ఎన్నికలు ఏడాదంతా నిర్వహిస్తూనే ఉంటారు. ఎన్నికల్లోనైనా జాతరల్లో అయినా మందు…విందులకే ప్రాధాన్యం.

Liquor shops | ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం

నర్సంపేట (Narsampet) డివిజన్ లోని 22 మద్యం షాపులు డిసెంబర్ ఒకటి నుండి మద్యం అమ్మకాలు ఊపందుకోనున్నాయి.. 22 మద్యం షాపులకు గతంలో 2 లక్షలకు టెండర్లు వేయగా నవంబరు నెలలో జరిగిన టెండర్లు దరఖాస్తు ధర 3లక్షలకు పెంచింది. అంటే ఏకంగా లక్షరూపాయలు పెంచింది. దీంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. నర్సంపేట పట్టణంలో 11 మద్యం షాపుల కొత్త రుములలోనికి మారనున్నాయి.

Click Here To Read More

Click Here To Read  రైతుల గుండెల్లో..

Leave a Reply