న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో గురువారం చుక్కెదురయ్యింది. ముందస్తు బెయిల్ కోసం ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, గోవిందప్ప పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అరెస్టు నుంచి మినహాయింపు కల్పించాలని నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చింది. మినహాయింపు ఇవ్వడం కుదరదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. కాగా, నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 5వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

ముందస్తు బెయిల్ కుదరదు..
ఏపీ లిక్కర్ కేసులో హైకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో బెయిల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని సుప్రీకోర్టు పేర్కొంది. ఈ నెల 7వ తేదీన హైకోర్టు విచారణ జరిగిన తర్వాతే నిందితుల బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని చెబుతూ.. విచారణను వాయిదా వేసింది. కాగా, గురువారం ఉదయం ఈ పిటిషన్‌ను మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.