KNL | ఎత్తిపోతలకు మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్టి.. రైతుల‌ను ఆదుకోవాలి : గడ్డం నారాయణ రెడ్డి

ఎమ్మిగనూరు టౌన్, జూన్ 19(ఆంధ్రప్రభ) : ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి రైతుల‌ను ఆదుకోవాల‌ని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి (Gaddam Narayana Reddy) కోరారు. గురువారం ఆయకట్టు రైతులతో కలిసి గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం (జీ ఆర్ పీ) కార్యాలయంను ముట్టడించారు. డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని అందుబాటులో అధికారులు ఎవరూ లేకపోవడంతో ఈఈ శ్రీనివాసులు (EE Srinivasulu) ఖాళీ కుర్చీకి అందించారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించిన ధర్నా నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎల్ఎల్సీ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే విధంగా జీఆర్పీ ఎత్తిపోతల పథకం రూపొందించారనీ, అయితే అధికారుల, పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతాంగం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులకు రూ. 1 కోటి 20 లక్షల నిధులు ప్రభుత్వం కేటాయించినా టెండర్లు పిలిచి పనులు చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలమ‌య్యారని విమర్శించారు. ఈ ఏడాది రబికి సాగునీరు, తాగునీరు ఉండదనీ ఇది వరకే ప్రకటించిందని గుర్తు చేశారు. కాని నియోజకవర్గంలోని పూలచింత, సోగనూరు, చిలకలడోణ ఎత్తిపోతల పథకాలు మరమ్మత్తులు నోచుకోకక పోవడం వల్ల దాదాపు 15 వేల ఎకరాల ఆయకట్టు రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. దీనికి తోడు పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందున పనులు ప్రారంభం కాలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Leave a Reply