letter | రాహుల్‌గాంధీకి హరీశ్‌రావు లేఖ

letter | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్‌గాంధీ వైఖరిని ప్రశ్నిస్తూ ఆయన లేఖ రాశారు.
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని బలోపేతం చేస్తామన్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడతామని మేనిఫెస్టోలో చెప్పారని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగం చేతబట్టి దేశవ్యాప్తంగా నీతిసూత్రాలు చెప్తారు… కాంగ్రెస్ అధికారంలో ఉన్నతెలంగాణలో మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారన్నారు.
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షించడమంటే ఇదేనా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రాహుల్‌గాంధీ బోధించే రాజ్యాంగ నైతికత ఇదేనా?, ఫిరాయింపుల నిరోధకచట్టాన్ని అవకాశవాదం కోసం వాడుకుంటున్నారని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు.
