ఏడాదిలో చెరువులన్నీ నింపుదాం
- భూగర్భ జలాలు పెంచుదాం
- నీటి సంరక్షణ సంఘాలను
- ఏర్పాటు చేద్దాం
- శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
(శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ) : ఏడాదిలోగా జిల్లాలోని అన్ని చెరువుల్లో, నీటి ట్యాంకుల్లో నీరు శాశ్వతంగా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ (Collector) ఏ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ (Shyam Prasad) మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ట్యాంకుల్లో నీటిని నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీరు వృధా కాకుండా నీటి సంరక్షణ పనులను చేపట్టాలన్నారు. ఫారం పాండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ విస్తరణను పెంచాలన్నారు. వ్యవసాయ పంటల (Agricultural crops) పై శ్రద్ధ చూపాలని సూచించారు.
మండల స్థాయిలో నీటి సంరక్షణ సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం నీటి నిల్వలు ఎంత ఉండేది, ఎంత మేర నీటిని ఖర్చు చేసేది, పంటలకు ఎంత నీటి అవసరం అనే తదితర వివరాలను తెలపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చిన్న నీటిపారుదల శాఖ ఈఈ గురుమూర్తి, డీఈ గంగాద్రి, ఏఈ షబానా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఇంచార్జ్ పిడి శ్రీలక్ష్మి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎస్ఈ రాజా స్వరూప్, డీఈ మురళి పాల్గొన్నారు.