సంగారెడ్డి జిల్లాలో సంచారం

సంగారెడ్డి, ఆంధ్ర‌ప్ర‌భ : సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో చిరుత పులి (leopard) సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. నిన్న రాత్రి ఓ ఆవుదూడ‌పై దాడి చేసి చంపింది. ఈ ఘ‌ట‌న‌తో గ్రామస్తులు ఉలిక్కిప‌డ్డారు. క‌డ్ప‌ల్ గ్రామానికి (Kadpal village) చెందిన రైతు తుకారాం త‌న పంట పొలంలోని ఓ రేకుల షెడ్డులో ఆవు దూడ‌ను క‌ట్టేశాడు. ఆ షెడ్డు వ‌ద్ద‌కు చేరుకున్న ఓ చిరుత పులి ఆవు దూడ‌పై దాడి చేసి చంపింది. ఈ రోజు ఉద‌యం పొలం వ‌ద్ద‌కు వెళ్లిన రైతు తుకారాం.. చ‌నిపోయిన ఉన్న ఆవును చూసి షాక‌య్యాడు. పోలీసు (Police)ల‌కు, అట‌వీశాఖ అధికారుల‌(forest department)కు స‌మాచారం అందించాడు.

అట‌వీశాఖ అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని పులి పాద‌ముద్ర‌ల‌ను సేక‌రించారు. ఇక ఆ ఏరియాలో చిరుత సంచారంపై దృష్టి సారిస్తామ‌న్నారు. గ్రామ‌స్తులు ఒంట‌రిగా పొలాల వ‌ద్ద‌కు వెళ్లొద్ద‌ని అధికారులు సూచించారు.

Leave a Reply