Cheetahs | డిసెంబర్ 1 నుంచి చిరుతల లెక్కింపు

Cheetahs | డిసెంబర్ 1 నుంచి చిరుతల లెక్కింపు
- డీఎఫ్ చక్రపాణి వెల్లడి
- నాలుగేళ్లకు ఒకసారి చిరుతల లెక్కింపు
- జిల్లాలో పాతిక వరకు చిరుతలు ఉన్నట్లు సమాచారం
Cheetahs | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుంచి జిల్లాలో చిరుతల లెక్కింపు కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా ఆర్థిక శాఖ అధికారి చక్రపాణి తెలిపారు. గురువారం ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడారు. సాధారణంగా దేశవ్యాప్తంగా నాలుగు సంవత్సరాలకు ఒకసారి పులులు, చిరుతగా లెక్కింపు జరుగుతూ ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి కేవలం చిరుతల లెక్కింపు మాత్రమే జరుగుతుందని డీఎఫ్వో తెలిపారు. మన ప్రాంతంలో పెద్దపులు లేవని, అందుకని కేవలం చిరుతల లెక్కింపు మాత్రమే ఉంటుందన్నారు. అయితే మరోపక్క శాఖాహార జంతువుల పరిస్థితిపై కూడా అధ్యయనం చేయడం జరుగుతుందన్నారు.
డిసెంబర్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు చిరుతపులల వివరాలు అనంతరం మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు శాకాహార జంతువుల వివరాలు అధ్యయనం చేశారని తెలిపారు. ముఖ్యంగా చిరుతల సంచారానికి సంబంధించి అడుగుల గుర్తులు, ఇంకా వాటి పెంటికలు ఆధారంగా వాటిని గుర్తించారన్నారు. వాస్తవానికి అడవుల్లో తాము సేకరించిన వాటిని శ్రీశైలం ప్రాంతంలో గల ల్యాబ్ కు పంపించి నిర్ధారణ జరిగిన తర్వాతనే చిరుతలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఇదే సందర్భంలో శాఖ హార జంతువులు వాటి సంరక్షణ వాటికి గల సదుపాయాలు ఆహార పరిస్థితులను గురించి కూడా సర్వే చేశారన్నారు. జిల్లాలో పాతిక వరకు చిరుతలు ఉన్నట్లుగా భావిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా డీఎఫ్ ఓ తెలిపారు. కాగా ఇప్పటివరకు ఐదు రూపాలుగా ఇలా ఆల్ ఇండియా స్థాయిలో చిరుతల చిరుతపులుల లెక్కింపు జరిగిందని ప్రస్తుతం జరుగుతున్న లెక్కింపు ఆరవధిగా ఉంటుందన్నారు.
