Leopard | కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులుల సంచారం…

Leopard | కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులుల సంచారం…

  • జుక్కల్,మద్నూర్, నిజాంసాగర్ మండలల్లో భయాందోళన
  • చిరుతల ఆచూకీ కోసం పరుగులు పెడుతున్న ఫారెస్ట్ అధికారులు
  • బొన్లు ఏర్పాటు చెయ్యాలని కోరుతున్న జనం

Leopard | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : ఎన్నడు లేని విధంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ ప్రాంతంలో చిరుతపులుల సంచారం రైతులకు, గ్రామస్తులకు కునుకు లేకుండా చేయడమే కాకుండా,ఫారెస్ట్ అధికారులకు పరుగులు పెట్టేస్తుంది. ఇటీవల జుక్కల్ మండలంలోని బంగారుపల్లి శివర్లో రెండు చిరుతపులులు సంచరిస్తుండగా అందులో ఒక మగచిరుతపులి మృతి చెందటం కలకలాన్ని రేపింది.

దీంతోపాటు మరో చిరుతపులి బంగారుపల్లి, బస్వాపూర్, దోస్ పల్లి, మైబపూర్, సిద్దాపూర్ శివార్లో సంచరిస్తున్నట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. చిరుతపులులు కుక్కలను ఇష్టంగా వేటాడటం జరుగుతుంది.కాబట్టి ఆయాగ్రామాల్లో ఐదుపెంపుడు కుక్కలు మాయం కావడంతో చిరుతలు ఎత్తుకుపోయారని గ్రామస్థులు భావిస్తున్నారు. దీంతోపాటు మద్నూర్ విద్యుత్ సబ్ స్టేషన్ లో చిరుతపులి సంచరించడమే కాకుండా, మేనూర్ ప్రధాన రహదారిపై కూడా చిరుతపులి సంచరిస్తున్నట్టు సిసిటివి పోటేజ్ లతో వెల్లడైంది. దీంతోపాటు నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లిలో వ్యవసాయ భూమిలో రక్షణగా కట్టినపెంపుడు కుక్కపై చిరుత దాడిచేసి చంపటం జరిగింది.

Leopard |

తాజాగా జుక్కల్ మండలంలోని పెద్దగుల్ల శివార్లలో చిరుతపులి సంచరిస్తున్నట్టు ఆగ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు ఆయా గ్రామస్తులకు అప్రమత్తం చేయడమే కాకుండా రాత్రి వేళల్లో పంట పొలాలకు వెళ్ళద్దని,పంట రక్షణకోసం ఎలాంటి విద్యుత్ వైర్లుగాని,సోలార్ వైర్లు గాని బిగించవద్దని ఆయారకాల జాగ్రత్తలు తెలపడం జరిగింది. జుక్కల్ ప్రాంతంలో వర్షధర పంటలు పండిస్తుండటంతో రైతులు రాత్రిపగలు పంటల కోసం శ్రమిస్తుంటారు.

Leopard |

ఈ రబి సీజన్లలో జుక్కల్ మండలంలోని మైబాపూర్,సిద్దాపూర్,దోస్ పల్లి,బంగారుపల్లి,బస్వాపూర్ గ్రామాలలో రైతులు 360 ఎకరల్లో సెనగ,380 ఎకరాల్లో మక్కా,1220 ఎకరల్లోమొక్క జొన్న,160 ఎకరల్లో వేరుసెనేగా పంటలను సాగు చేయడం జరిగింది.ఈ పంటలు దిగుబడి రావాలంటే రైతులు పంట పొలాలకు రాత్రింబగళ్లు వెళ్ళవలసి ఉండగా,రాత్రి సమయాల్లో పంట పొలాలకు వెళ్లకపోవటంతో చేతికోచ్చే పంటలు నష్టపోవటం జరుగుతుందని,చిరుతల భయంతో రాత్రికి పోవడం లేదని రైతులు ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.

దీంతోపాటు వానకాలంలో వేసిన కంది పంట రాశులు కూడాచేయాల్సి ఉండగా, జుక్కల్ ప్రాంతా రైతులు దిక్కుతోచని పరిస్థితులు కొట్టుమిట్టడుతూన్నారు. ఫారెస్ట్ అధికారులు చిరుతపులుల కోసం బొన్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతుండగా,బొన్లు ఏర్పాట్లు జిల్లాఫారెస్ట్ అధికారుల చేతుల్లో లేనట్టు తెలుస్తుంది.

రాష్ట్రస్థాయి అధికారులు స్పందిస్తే బోన్ల ఏర్పాటు సాధ్యంఅని తెలుస్తోంది. జుక్కల్ లో ఫారెస్టు ప్రాతంలేని మాములు అడవుల్లో సయితం చిరుతపులుల సంచారం కొనసాగుతుంది.చిరుత పులుల నివారణకు చర్యలు చేపట్టాలని,తమ పడిపశువులను,పంటలను కాపాడాలని,ప్రాణహాని జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టి,జుక్కల్ ప్రాంత ప్రజల భయాందోళన తొలగించాలని ప్రజలు,రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Leave a Reply