హైదరాబాద్, ఆంధ్రప్రభ : తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఒక తెరిచిన పుస్తకం లాంటింది.. తెలంగాణ ప్రజలకు తెలుసు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు (T Harish Rao) అన్నారు. లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయన మాట్లాడారు. గత కొంతకాలంగా తమ పార్టీపైన, తనపైన కొన్ని రాజకీయ పార్టీలు (Political parties) చేస్తున్న వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
‘కేసీఆర్ (KCR) నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో తాను చూపిన నిబద్ధత, తన పాత్ర అందరికీ తెలిసిందే ‘ కేసీఆర్ కాలంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
ద్రోహుల్ నుంచి కాపాడుకుంటాం…
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం తమ కర్తవ్యంమని, ద్రోహుల చేతుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంపైనే తమ దృష్టి అంతా ఉంటుందని హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని, ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామన్నారు.

