ఉజ్జెల్లిలో హైమాస్ట్ లైట్ ప్రారంభించిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

మక్తల్, ఆంధ్రప్రభ ; నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గం, మాగనూర్ మండలంలోని ఉజ్జెల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర, బీజేపీ నాయకులు, కార్యకర్తల కోరికమేరకు తన స్వంత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఉజ్జెల్లి గ్రామానికి ఎంపీ డీకే. అరుణమ్మ సహకారంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు మంజూరు అవుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సంగంబండ బలరాం రెడ్డి ,మాగనూర్ మండల అధ్యక్షులు జయానందన్ రెడ్డి ,జిల్లా కౌన్సిల్ మెంబెర్ వాకిటి మల్లేష్, జిల్లా కార్యదర్శి కనకరాజు ,టిఏసి మెంబెర్ పసుల నీరజ్ ,నర్వ మండల బీజేపీ అధ్యక్షుడు అజిత్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ్ రామ్, పెగడబండ నర్శిమ్మ రెడ్డి, ఉజ్జెల్లి గ్రామ సర్పంచ్ , ఉపసర్పంచ్ , వార్డు మెంబర్లు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply