కొత్త అంబులెన్స్ ప్రారంభం
జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో పాత అంబులెన్స్‌ల స్థానంలో కొత్తవి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన అత్యవసర సేవలు అందిస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ (Chittoor District Collector Sumit Kumar) పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో కొత్త అంబులెన్స్‌ను కలెక్టర్, డీసీహెచ్‌ఎస్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన ఆసుపత్రి (District Head Hospital)కి సంబంధించి పాత బడిన అంబులెన్స్‌ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐఓసీఎల్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద త్వరలో మరొక అంబులెన్స్ రానుందని, దీనితో వీటి సంఖ్య నాలుగుకు చేరుతుందన్నారు. అత్యవసర వైద్య చికిత్స, రెఫరల్‌ల కోసం వేలూర్, తిరుపతిలోని ఆసుపత్రులకు రోగులను సరియైన సమయంలో తీసుకువెళ్లాడానికి అంబులెన్స్‌లు ఉపయోగకరంగా ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, డీఎంఅండ్‌హెచ్ఓ డా.సుధారాణి, డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి, మెడికల్ డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ ఉషా, ఐఓసీఎల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీయూష్ మిట్టల్, సీజీఎం (ఆపరేషన్స్) సూరజ్ కుమార్ పట్నాయక్, జీఎం (ఎల్‌పీజీ) సతీష్ వెర్నేకర్, డీజీఎం(సీఎస్ఆర్ ), కైలాష్ కాంత్, చిత్తూరు ఐఓసీఎల్ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ ఇంఛార్జ్ బి. రామారావు, చిత్తూరు ఐఓసీఎల్ పీఓఎల్ టెర్మినల్ ఇంచార్జి అరుణ్ ప్రసాద్ వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.