వైభవంగా లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం…

బిక్కనూరు, ఆంధ్రప్రభ ; మండల కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శివపార్వతుల కళ్యాణం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గత మూడు రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పెద్ద ఎత్తున హోమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అభిషేకాలు అర్చనలు చేశారు.

కళ్యాణాన్ని పురస్కరించుకొని లక్ష్మీ వెంకటేశ్వర, శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించి ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో కల్యాణాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించారు. కళ్యాణమనంతరం మహిళలు ఓడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని ఆకాంక్షించారు. కళ్యాణ అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply