లక్షేటిపేట కోర్టు ఏజీపీ నియామకం
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా లక్షేటిపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా మండలంలోని కవ్వాల హాస్టల్ తాండ(Kavwala Hostel Thanda)కు చెందిన లాయర్ బానావత్ సంతోష్ నాయక్‌ను హైదరాబాద్ ప్రభుత్వం జస్టిస్ సెక్రెటరీ బీ.పాపిరెడ్డి(Justice Secretary B. Papireddy) నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మారుమూల గిరిజన ఏజెన్సీ గ్రామమైన కవ్వాల హాస్టల్ తండాలో నిరుపేద కుటుంబంలో జన్మించి, ఏజీపీ(AGP)గా నియామకమైన అతను 2016లో ఎల్ఎల్.బీ పూర్తి చేసి, న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. వృత్తిరీత్యా మంచి నైపుణ్యాన్నిప్రదర్శిస్తూ అందరితో కలివిడిగా ఉంటూ వృత్తినే దైవంగా నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగి ఎజీపీగా నియామకమయ్యారు.
ఈ సందర్భంగా సంతోష్ నాయక్(Santosh Nayak) ఆదివారం మాట్లాడుతూ, లక్షేటిపేట కోర్టులో బంజారా ముద్దుబిడ్డగా తనను ఏజీపీగా నియమించడం ఎంతో గౌరవమన్నారు. వందేళ్ల చరిత్రలో లక్షేటిపేట కోర్టు ఇప్పటివరకు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బంజారాల(Banjara)ను ఏజీపీగా నియమించలేదని ఆయన చెప్పారు. తాను సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టి, ఎన్నోఒడిదుడుకు ఎదురుకొని న్యాయవాదిగా పేద ప్రజలకు ఉచితం(free)గా న్యాయ సేవలు అందించాలని ఆయన తెలిపారు. తన నియమకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.