Laksettipet | ఇరిగేషన్ ప్రాజెక్టులు కాంగ్రెస్ తోనే సాధ్యం

Laksettipet | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఇవాళ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… మున్సిపాలిటీ పరిధిలోని మోదేలలో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ రూ. 74.50 లక్షలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంజూరు చేపించడం చరిత్రలో నిలిచిపోతోందన్నారు. రైతుల ఎన్నో ఏండ్ల కలను నెరవేర్చిన ఘనత ఎమ్మెల్యేకే దక్కిందన్నారు.
రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా న్యాయం చేసేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని వివరించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రేమ్ సాగర్ రావు కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలే నాటికీ నేటికీ ఇరిగేషన్ రంగంలో ఎనలేని కృషి చేశాయని, చేస్తున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరీఫ్, ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్, నాయకులు పూర్ణ చందర్, మసాలా సతీష్, తోట రమేష్, నగేష్, వెంకటేష్, రాజు, లచ్చన్న కాంతయ్య, షాహిద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
