ఉపాధి కూలీలు వేసవిలోజాగ్రత్తగా పనులు చేయాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఉపాధి హామీ పథకంలో కూలీలు వేసేవి కాలం వడదెబ్బ సోకకుండా జాగ్రత్తగా పనులు చేయాలని మొగ్దుంపూర్ సర్పంచ్ తిరుమలేష్ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిమొగ్దూంపూర్ ఉపాధి హామీ పనులు పరిశీలించారు. ఎండలో పనులు చేస్తున్న కూలీలకుశీతల పానీయాలుపంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని రైతులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలనిఅన్నారు.

ఉదయం సాయంత్రం వేళ ఉపాధి పనులు చేపట్టాలనిఅన్నారు. ఎండల నుండి ఉపశమనంకలిగేందుకు కూలీలకు కూల్ డ్రింక్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టే వివిధ పనులు కొలతల ప్రకారంచేపడితే గిట్టుబాటుకూలివస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఉపాధి పని ప్రదేశంలో కూలీలకు ఏర్పాటు చేయాల్సిన వసతులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్, గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply