KVN Productions | బడా స్టార్స్ తో క్రేజీ సినిమాలు..

KVN Productions | బడా స్టార్స్ తో క్రేజీ సినిమాలు..

KVN Productions | జన నాయగన్, టాక్సిక్ సినిమాలతో కెవిఎన్ క్రేజ్
కెవిఎన్ బ్యానర్‌లో ప్రభాస్ భారీ పాన్ ఇండియా మూవీ?
చిరంజీవి – బాబీ కాంబో మూవీపై భారీ ప్లాన్స్
టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో వరుస సినిమాల ప్లాన్
స్టార్ డైరెక్టర్లను లాక్ చేసిన కెవిఎన్ సంస్థ

KVN Productions | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కన్నడ, తమిళ భాషల్లో టాప్ స్టార్స్ తో వరుసగా సినిమాలు చేస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్. ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. తెలుగులో టాప్ స్టార్స్ తో వరుసగా సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని తెలిసింది. తెలుగులో (Telugu) టాప్ లో ఉన్న నిర్మాణ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేలా ఈ సంస్థ సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందట. ఇంతకీ.. కెవిఎన్ ప్లాన్ ఏంటి…? తెలుగులో ఎవరెవరితో సినిమాలు చేయబోతుంది..?

KVN Productions

KVN Productions | జన నాయగన్, టాక్సిక్..

కెవిఎన్ సంస్థ కన్నడలో టాక్సిక్ అనే భారీ క్రేజీ మూవీని నిర్మించింది. కేజీఎఫ్ హీరో యశ్ నటించిన ఈ సినిమాని గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. ఈ సినిమా గ్లింప్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీగా క్రేజ్ వచ్చింది. కేజీఎఫ్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ పాన్ ఇండియా మూవీని మార్చి 19న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. జూన్ 4న రిలీజ్ (Release) చేస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఈ సినిమా కోసం కెవిఎన్ సంస్థ ఎక్కడా రాజీపడకుండా మంచి క్వాలిటీతో.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించింది.

KVN Productions

KVN Productions | కెవిఎన్ బ్యానర్ లో.. ప్రభాస్..

ఇక తమిళ్ లో.. కోలీవుడ్ స్టార్ విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ నిర్మించింది. ఈ సినిమాకి సెన్సార్ కష్టాలు తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కెవిఎన్ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. చిరు, బాబీ కాంబోలో మూవీని ఈ సంస్థే నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని (Movie) త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీరితో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడా ఓ భారీ పాన్ ఇండియా మూవీ నిర్మించాలి అనుకుంటుందట. ఆల్రెడీ ప్రభాస్ తో కెవిఎన్ సంస్థకు మీటింగ్ జరిగిందని.. ప్రభాస్ కూడా ఈ సంస్థలో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని సమాచారం.

KVN Productions

KVN Productions | టాలీవుడ్ టాప్ స్టార్స్ తో..

చిరంజీవి, ప్రభాసే కాకుండా పవన్ కళ్యాణ్‌, రామ్ చరణ్‌, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ తదితర స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తుందట. స్టార్ హీరోలే కాకుండా స్టార్ డైరెక్టర్స్ (Star Directors) కి కూడా అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసిందని తెలిసింది. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, శౌర్యవ్ తదితర దర్శకులకు ఈ సంస్థ అడ్వాన్స్ ఇచ్చిందట. మొత్తానికి కెవిఎన్ భారీగానే ప్లాన్ చేస్తుంది. అయితే.. ముందుగా ఈ సంస్థ జన నాయగన్, టాక్సిక్ రిలీజ్ చేసి… ఆతర్వాత క్రేజీ ప్రాజెక్టుల పై ఫోకస్ పెట్టనుందని సమాచారం.

KVN Productions

Leave a Reply