హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా , కుషాయిగూడ పారిశ్రామికవాడ లో నేటి ఉదయం దారుణం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుడు ట్రాక్టర్‌లో చెత్త వేస్తుండగా పేలుడు జరిగింది. భారీ శబ్ధంతో గుర్తు తెలియని వస్తువు పేలడంతో తీవ్రంగా గాయపడిన కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు . ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. పారిశ్రామిక వాడల్లో ఉపయోగించిన కెమికల్స్ డబ్బాలను చెత్తలో పడేస్తుంటారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా కుషాయిగూడ పారిశ్రామికవాడలో జరిగిన ఘటనలో కెమికల్ డబ్బా పేలి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kushaiguda | చెత్త యార్డ్ లో పేలుడు – స్పాట్ లో కార్మికుడి దుర్మరణం
