కర్నూల్ బ్యూరో : కశ్మీర్ లోని పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా మంగళవారం కర్నూలు జిల్లా రోలర్ స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో స్కేటింగ్ క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్థానిక ఔట్ డోర్ స్టేడియం స్కేటింగ్ రింక్ నుంచి ఎస్ పి జి చర్చ్, కోట్ల సిర్క్లర్, కిడ్స్ వరల్డ్ నుండి రాజ్ విహార్ మీదుగా కలెక్టరేట్ వరకు స్కేటింగ్ క్రీడాకారులు ఐదు కిలోమీటర్ల పాటు ర్యాలీ నిర్వహించారు.
ఉగ్రవాదుల అణిచివేతకు ప్రభుత్వం చేస్తున్న పోరుకు క్రీడాకారుల సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి అబూబకర్, సీఈఓ పి.సునీల్ కుమార్, శిరీష్ బాబు, కోచ్ లు రాజా వర్ధన్, శామ్యల్ రెనాల్డ్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.