Kurnool | బానకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేయడమే నా జీవిత ఆశయం – చంద్రబాబు

కర్నూలు బ్యూరో, , ఆంధ్రప్రభ. రాయలసీమను సస్య శ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నూలు నగరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కర్నూలు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదికపై ఆయన ప్రసంగించారు. సీమలో సాగునీటి తాగునీటికి కొరత లేకుండా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఇందులో భాగంగానే బానకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయడమే తన ప్రధాన జీవిత ఆశయం అన్నారు.

నెలకొకసారి మూడో శనివారం రాష్ట్రం ను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రైతు బజార్ లు 1999 లో. తానే తీసుకువచ్చానన్నారు.మంచి ఉద్దేశ్యంతో రైతులకు గిట్టుబాటు ధరలు రావాలి వినియోగదారులకు మంచి కూరగాయలు అందించాలని లక్ష్యంతో తీసుకొచ్చామన్నారు. పల్లె వెలుగు పేరుతో ఆర్టీసీ బస్సులు తీసుకొచ్చాం తెల్లవారు జామున వచ్చే లా చేశాం..వినియోగదారులకు ఫ్రెస్ గా వెజిటేబుల్ లో కనిపించేవన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో125 రైతు బజార్లు ఉన్నాయి.. రైతు బజార్ ను ఆదర్శంగా తీర్చిదిద్దినన్నట్టు వెల్లడించారు. ఓన్ ఇయర్ లో మంచి రైతు బజార్ గా చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో 175 నియోజకవర్గాలలో 175 రైతు బజర్లను ఏర్పాటు చేస్తామన్నారు.

పి 4 మార్గదర్శిగా బంగారు కుటుంబం.. తీసుకురావాలన్నదే నా ఉద్దేశం అని అన్నారు చంద్రబాబు. 2029 లోపు జీరో ప్రావర్టి చేసే బాధ్యత నాదన్నారు ..పేద వారి ఇంట్లో వెలుగు తేవాలని కృషి చేస్తున్నా…ఎవ్వరూ పేదవారు గా ఉండకూడదు.. అనేది తన లక్ష్యంగా చంద్రబాబు పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేశ్, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్,స్టేట్ రజక ఫెడరేషన్ చైర్మన్ సావిత్రి, కేడీసీసీబీ విష్ణువర్ధన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్,, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply