ప్రభుత్వం తరఫున కర్నూలు జిల్లా కలెక్టర్ సమర్పణ..

కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : శరన్నవరాత్రి దసరా ఉత్సవాల సందర్భంగా అలంపూర్‌లో వెలసిన శ్రీ జోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు.

మంగళవారం ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్‌ ముందుగా స్వామికి అభిషేకం చేశారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు వేదాశీర్వచనాలతో కలెక్టర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జోగుళాంబ బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాల సమర్పణ ఆనవాయితీగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి. సుధాకర్ రెడ్డి, ఆలయ ఈవో సహా సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply