రోడ్డు బాగు చేయాలని కుర్మపల్లి గ్రామస్థుల ఆందోళన

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : అధిక లోడ్ తో వెళుతున్న భారీ వాహనాలు, టిప్పర్లు, లారీలతో రోడ్డు పూర్తిగా చెడిపోయి నానా తంటాలు పడుతున్నామని పెద్దపల్లి మండలం కుర్మపల్లి గ్రామస్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. గ్రామాల్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రోడ్డుపై వంటా వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. లారీల వల్ల రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయని గ్రామస్థులు కంకర, బోల్డర్, మట్టి లారీలను అడ్డుకున్నారు. రెండు సంవత్సరాల నుండి గ్రామస్తులు అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని గ్రామ సర్పంచ్ గొర్రె లక్ష్మి లింగయ్య, ఉప సర్పంచ్ బిటి అశోక్, వార్డ్ సభ్యులు ఆరోపించారు. మా సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నిరసనను ఇంకా ముందుకు తీసుకపోతామని గ్రామస్తులు చెబుతున్నారు. ధర్మారం ఎక్స్ రోడ్ లో ఉన్న క్రషర్ల దుమ్ము, లారీల దుమ్ముదుతో అనేక వ్యాధులు వస్తున్నాయని పేర్కొంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

Leave a Reply