Kuppam | కోదండ రామస్వామి ర‌థోత్స‌వంలో నారా భువ‌నేశ్వ‌రి

కుప్పం, (ఆంధ్రప్రభ ): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. హైదరా బాద్ నుంచి బెంగళూరు విమానా శ్రయం చేరుకొని అక్కడినుండి రోడ్డుమర్గంలో శాంతిపురం మండ లం రాళ్ళబుదుగురు గ్రామంలో వెలసిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవల్లో పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యంత వైభవంగా నిర్వహించిన బ్రహ్మ రథోత్సవం కార్యక్రమంలో భక్తులతో పాటు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. తమ గ్రామంలో నిర్వహిస్తున్న స్వామి వారి రథో త్సవం లో పాల్గొన్న భువనేశ్వరి కి ఆలయ పండితులు వేద మంత్రాల తో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు

అంతకుముందు నియోజకవర్గం కి విచ్చేసిన భువనేశ్వరికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఘనంగా స్వాగతం పలికారు. అక్కడినుండి కదిరిముతనపల్లి గ్రామంలో కురభ కులస్తులు ఆరాధ్య దైవం సిద్దేశ్వర స్వామి పెద్ద దేవర కార్యక్రమంలో పాల్గొన్నారు.

12 సంవత్సరాలకు ఒక్కసారి జరుపుకునే ఈ పెద్ద దేవర కి కురభ కులస్తులు భారీగా తరలివచ్చారు. సుమారు 5 లక్షల మంది పాల్గొంటా రని అంచనా వేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ థో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ఇంత భారీ సమూహం కుప్పం ప్రాంతంలో చేరడం అరుదు.

ఈ సంద‌ర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, ఎంతో చరిత్ర కలిగిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవల్లో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా సాంప్రదాయలను, ఆచారాలను తప్పకుండా పాటించడం మంచి విషయమే అని,భక్తి శ్రద్లలతో పెద్ద దేవర నిర్వహించిన వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *