Kuntala | సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సాయం

Kuntala | సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సాయం

  • దొంగతనాల నివారణకు కట్టెందుకే సీసీ కెమెరాలు
  • నగదును అందజేస్తున్న రియల్ ఎస్టేట్ అబ్దుల్ వాయిద్

Kuntala | కుంటాల, ఆంధ్రప్రభ : దొంగతనాల నివారణను అరికట్టాలంటే సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని కోరుతూ కుంటాల మండలంలోని అందకూర్ గ్రామంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి అబ్దుల్ వాహీద్ తన సొంత డబ్బులు రూ.50వేలను గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా దొంగతనాల నివారణను అరికట్టందుకే సీసీ కెమెరాలు గ్రామాల్లో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానమ‌ని తెలియజేశారు. దీని ద్వారా దొంగలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా సీసీ కెమెరాల కోసం నగదు అందజేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అబ్దుల్ వాయిద్ ను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్, సాయినాథ్, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply