Kummera | గ్రామాభివృద్ధికి కృషి చేస్తా..
Kummera, నాగర్ కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రభ : కుమ్మెర గ్రామ అభివృద్ధి కోసం తన సాయి శక్తుల కృషి చేస్తానని కుమ్మెర సర్పంచ్ అభ్యర్థి తుకారం రెడ్డి హామీ ఇచ్చారు. తుకారాం రెడ్డి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కుచ్ కుల రాజేశ్వర్ రెడ్డి, రాజేష్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన పనుల కోసం నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని తెలియచేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరమ్మ ఇండ్లు ఇలా ప్రభుత్వపరంగా వచ్చే అన్ని పథకాలను ప్రజలకు అందేలా చేస్తానని అన్నారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని.. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ సేవలందిస్తున్నానని చెప్పారు. ఎన్నికలలో తనను బలపరిచి తనకు ఓటు వేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తన గెలుపు కోసం కృషి చేయాలని తుకారం రెడ్డి కోరారు.

