KTR | ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే..

KTR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్‌ఎస్ నేతల గృహనిర్బంధాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా వెళ్లే నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మహేశ్‌రెడ్డి తదితర బీఆర్‌ఎస్ నేతలను గృహనిర్బంధంలో ఉంచడంపై కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు సంఘీభావం తెలపడానికి వెళ్లే నాయకులను అడ్డుకోవడం సరికాదని అన్నారు.
“పోలీసుల బలంతో గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ఇప్పుడు పేదల భూములపై దృష్టి పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు, అరెస్టులు బీఆర్‌ఎస్ నేతలకు కొత్త కాదని, భూసేకరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
