కేసీఆర్‌ను కలిసిన కేటీఆర్, హరీశ్‌రావు
గజ్వేల్, ఆంధ్రప్రభ : భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR), మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) భేటీ అయ్యారు. ఈ రోజు గజ్వేల్ మండలంలోని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను కలవడానికి కేటీఆర్, హరీశ్ రావు వెళ్లారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి చర్చించినట్లు సమాచారం. రోడ్డు షో, ప్రచార వ్యూహాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైనా వారు చర్చించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ లోని వివిధ ప్రాంతాల ఇన్‌చార్జీలతో రేపు కేసీఆర్ సమావేశం కానున్నారని తెలిసింది.