KTR | పద్ధతి మార్చుకో…

KTR | పద్ధతి మార్చుకో…

  • రాహుల్‌, రేవంత్‌ల‌పై వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌
  • జుక్కల్‌లో కేటీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం

KTR | జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఆందోళ‌న చేప‌ట్టారు. కాంగ్రెస్ మండల యువజన కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద యువజన నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

అధికారం లేకపోవడంతో కేటీఆర్ మతిస్థిమితం పోయిందని, అందుకే లేనిపోని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని కాంగ్రెస్ మండల యువజన అధ్యక్షుడు సతీష్ పటేల్ మండిప‌డ్డారు. కేటీఆర్ తన పద్ధతిని మార్చుకోవాలని, ఇక ముందు నోరుజారకుండా జాగ్రత్త వహించాలని, లేదంటే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామ‌న్నారు. కేటీఆర్ ఇంటిని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండలంలోని యువజన కాంగ్రెస్ నాయకులు పదుల సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply