ఏపీ ఐ అండ్ పీఆర్ సంచాలకులుగా బాధ్యతలు స్వీకరణ
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా కె.ఎస్. విశ్వనాథన్ (KS Viswanathan) సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సమాచార శాఖ సంచాలకులుగా ఉన్న హిమాన్షు శుక్లా శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసిన అనంతరం ప్రఖర్ జైన్ కు సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.
విశాఖ మెట్రోపొలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ కమిషనర్ (Commissioner of Visakhapatnam Metropolitan Region Development Authority) గా ఉన్న కె.ఎస్. విశ్వనాథన్ ను సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతం లో ఆయన అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్ గా, నరసాపురం సబ్ కలెక్టర్ గా, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథన్ కు సమాచార శాఖ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాఖ కార్యకలాపాలు, నిర్వర్తిస్తున్న విధులపై అధికారులతో నూతన సంచాలకులు సమీక్షించారు.