Krittivennu | రేపు కృత్తివెన్నులో పవన్ కళ్యాణ్ పర్యటన

Krittivennu | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 21వ తేదీ (బుధవారం) ఉదయం కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామంలో పర్యటించనున్నట్టు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. పార్టీ శ్రేణుల నుంచి సమాచారం రావడంతో జనసేన నాయకులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
