శ్రీశైలం ప్రాజెక్టులో కృష్ణమ్మ సయ్యాట

శ్రీశైలం ప్రాజెక్టులో కృష్ణమ్మ సయ్యాట
- ఎనిమిదవ సారి గేటు ఎత్తివేత
శ్రీశైలం, ఆంధ్రప్రభ : ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టులో అన్నీ చిత్ర విచిత్రాలు నమోదవుతున్నాయి. ఆదివారం జూరాల, సుంకేసుల నుంచి కృష్ణమ్మ జలధార తగ్గటంతో గేట్లన్నీ అధికారులు మూసేశారు. ఇంతలోనే సోమవారం సాయంత్రం మళ్లీ క్రెస్ట్ గేట్ ఎత్తక తప్పలేదు. ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి 1,19,613 క్యూసెక్కుల నీరు చేరటంతో.. అప్పటికే ప్రాజెక్టు నిండిపోయిన దశలో నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు చేరుకుంది.
ఇక వెంటనే శ్రీశైలంలో ఒక గేటును ఎత్తి 95,674 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ఇలా ఎనిమిదవ సారి శ్రీశైలం గేట్లను ఎత్తటం విశేషం. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో నీటి సమాచారం కింది విధంగా ఉంది.
జలాశయం పూర్తి నీటి మట్టం : 885.00 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 885.00 అడుగులు
ఇన్ ఫ్లో : 1,19,613 క్యూసెక్కులు
జూరాల : 38,651 క్యూసెక్కులు
స్పిల్ వే : 71,820 క్యూసెక్కులు
సుంకేసుల : 8892 క్యూసెక్కులు
హంద్రీ : 250 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : క్యూసెక్కులు
పవర్ జనరేషన్ : 62,645 క్యూసెక్కులు
కుడి పవర్ జనరేషన్ : 27,330 క్యూసెక్కులు
ఎడమ పవర్ జనరేషన్ : 35,315 క్యూసెక్కులు
స్పిల్ వే 28,075 క్యూసెక్కులు..
1గేట్లు 10 అడుగులు ఎత్తి : 95,674 క్యూసెక్కులు సాగర్ కు విడుదల..
నీటి నిల్వ సామర్థ్యం : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ : 215.3263 టీఎంసీలు గా ఉన్నాయి.
..1 గేట్ల ద్వారా 10 అడుగుల మేర ఎత్తి సాగరకు నీరు విడుదల..
