Krishna Satakam | కృష్ణ శతకం

106. సమరమందు నీవు సారధిగా నిల్చి
బావగారటన్న భయము లేక
చెవిని ఇల్లు కట్టి చవులూర చెప్పిన
గీతదాత నీకు కేలుమోడ్తు

107. గోపికల వలువలు సంహరించినవాడ
వాడవాడ నీదె అడుగుజాడ
చక్కనైనవాడ చిక్కని మనసున్న
గీతదాత నీకు కేలుమోడ్తు

108. స్వంత ధర్మమందు అంతమయిన మేలు
పరుల ధర్మన్న భయము కలుగు
భరత భువిని ధర్మపాలన సాగగ
గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply