Gold theft | ఐదుగురు అరెస్ట్

Gold theft | ఐదుగురు అరెస్ట్
Gold theft |మచిలీపట్నం, ఆంధ్రప్రభ : చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ రాజా వెల్లడించారు.
మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ… నిందితుల వద్ద నుంచి మొత్తం 318 గ్రాముల బంగారంను(Gold) స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని తెలిపారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే చిలకలపూడి ఇన్స్పెక్టర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారని, సేకరించిన సాక్ష్యాలతో నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. అరెస్టైనవారు అంతర్జిల్లా దొంగల గ్యాంగ్‌కు చెందినవారని, వీరిపై గతంలో కూడా అనేక కేసులు (Cases) నమోదై ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. రికవరీ చేసిన బంగారాన్ని సంబంధిత కేసుల ప్రకారం బాధితులకు అప్పగిస్తామని చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
అరెస్టైన నిందితులు… విక్రమ్ కుమార్, కొత్త రఘునాథ్, షేక్ అమతుల్ ఖదీర్, రావులపాటి అయ్యప్ప, అందుగుల ఉదయ్ కిరణ్ గా గుర్తించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన సిబ్బందిని డీఎస్పీ రాజా(DSP Raja) అభినందించి రివార్డు ప్రకటించారు.
ఇది కూడా చదవండి సిపీ స్టయిల్ ఛేజింగ్..
