కృష్ణ శతకం

19. ఆ కుచేలుడదుగొ ఆప్త మిత్రుండైన
బాధలెన్నో పడిన గాధ వినగ
విధిబలీయమనుట పెనుసత్యమే కదా!
గీతదాత నీకు కేలుమోడ్తు

20. గోపికలను కూడ గోపికావల్లభు
డన్న పేరు వచ్చె మిన్నయయ్యె
ఓపికెంత నీకు ఓపికా వల్లభా
గీతదాత నీకు కేలుమోడ్తు

21. చిలిపితనము నీదె జీవితశిల్పివి
నీవెనయ్య ఎంత నేర్పరివయ
కొంటెచూపులున్న గోవిందుడవు నీవు
గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply