94. పైనవేరునుండు దాని కొమ్మలు క్రింద
వృక్షమదియె దివ్యవీక్షణమున
అట్టిచెట్టు పేరు అశ్వత్ధ మనజెల్లు
గీతదాత నీకు కేలుమోడ్తు
95. వస్త్రములను మార్చు పగిదిగా జన్మలు
మారుచుండు ఆత్మ మనుగడకును
ఎన్ని చిత్రములును ఎన్ని పాత్రలు నీవి
గీతదాత నీకు కేలుమోడ్తు
96. నేలలోన కలియు నింగిలోనను చేరు
జీవియనుట ఎంత చిత్రమయ్య
పంచభూతములును పరమాత్మ క్రీడలు
గీతదాత నీకు కేలుమోడ్తు