82 ఒంటరయిననేమి? తుంటరయిననేమి?
అసురులెందరైన హితముజేసి
వెలుగులన్ని నింపు విష్ణువు నీవయా
గీతదాత నీకు కేలుమోడ్తు
- దివ్యమైనయట్టి దీపావళికి నీవె
కారకుండవయ్య ప్రేరకుండ
సత్యభామపతివి సాహసయోధుడా!
గీతదాత నీకు కేలుమోడ్తు - భాగవతము వ్రాసి పరమభక్తుడిగను
పోతనాఖ్యుడిలను పొలుపునందె
కృష్ణభక్తుడన్న కీర్తియే ఘనమయ్య
గీతదాత నీకు కేలుమోడ్త్తు