- గోపకులముగాచ గోవర్ధనము నెత్తు
సాహసుడవు పార్థసారధివయ
పిట్టకొంచెమైన పాట ఘనమగును
గీతదాత నీకు కేలుమోడ్తు - గురువయూరులోన కొలువైన గోకుల
రక్షచేయువాడ భిక్షపెట్టి
ఏమి జపము చేరు ఏ తపమ్మునుజేతు
గీతదాత నీకు కేలుమోడ్తు - పంచపాండవులకు పంచగ్రామములను
పంచి ఇమ్మనుటను ప్రజ్ఞ కలదు
అలవిలేనియట్టి తెలివితేటలు సొత్తు
గీతదాత నీకు కేలుమోడ్తు
కృష్ణ శతకం
