కృష్ణ శతకం

55. జయజనార్ధనుంద! భయవిమోచకుడవు
అచ్యుతుండవయ్య అద్భుతముగ
ధర్మరక్షకుడవు ధరణి రక్షకుడవు
గీతదాత నీకు కేలుమోడ్తు

56. సత్యపతివి నీవసత్యమాడినగాని
తగ్గగలవు నీవు నెగ్గుటకును
మాధవుండ వీవు మహిమలెన్నంగను
గీతదాత నీకు కేలుమోడ్తు

57. చిన్నికృష్ణునకును ఎన్నెన్ని ముద్దులు
ముచ్చటలును జూడ మురిపెమేను
బాలకృష్ణుడిగను పరవశింపగజేయు
గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *