43. గోలలన్న జూడ లీలలేయగునయ్య
నీదు చేతలందు నిశ్చయముగ
ఎంత చిత్రమయ్య ఎంత పవిత్రము
గీతదాత నీకు కేలుమోడ్తు
44. పుడమి కష్టములును పుట్టి పుట్టినవాడ
నెలత వలస కూడ కలతలేసు
నీదుసుఖము జూడ నేతిబీరయె కదా!
గీతదాత నీకు కేలుమోడ్తు
45. జయమునిచ్చువాడ! జగతియంతయు కూడ
గరుడవాహనుండ ఘనయశుండ
దిగ్దిగంతములకు తేజమ్ము నింపిన
గీతదాత నీకు కేలుమోడ్త్తు